Monday, May 21st

Telugu News - Online Telugu News Portal

జగన్ పిచ్చివాడులా మారాడు : పాల్వాయి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ పిచ్చోడులా మారాడని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన తండ్రి వారసుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం చేపట్టాలన్న తపనతో ఆయనకు పిచ్చెక్కిందన్నారు. జగన్‌కు పిచ్చిముదరడం వల్లే కాంగ్రెస్ పార్టీపైనా, కాంగ్రెస్ ప్రభుత్వం పైనా తన మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనను ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితి ఏమాత్రం లేదన్నారు.

అయితే ఆయన కాంగ్రెసు ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో మాత్రం పార్టీ విఫలమైందని ఆయన అన్నారు. ఇటీవల జగన్‌పైనా కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శల జోరు తగ్గించినట్టు వస్తున్న వార్తలపై ఆయన ఇలా స్పందించారు. కాగా జగన్ తన ఓదార్పు యాత్రలో మళ్లీ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారు. ఇటీవల గుంటూరులో కాంగ్రెసు పెద్దలు, టిడిపి కలిసి తనపై కుట్ర పన్నుతున్నాయని అన్నారు. ఇలా రోజుకో విధంగా జగన్ మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.