యానాంలోని సిరామిక్ టైల్స్ తయారీ పరిశ్రమ రీజన్సీ సిరామిక్స్ కంపెనీ మంగళవారం రాత్రి మాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. పరిశ్రమ జనరల్ మేనేజర్ హెచ్.ఆర్.కే ఈ లాకౌట్ ప్రకటన కాపీని పరిశ్రమ మెయిన్ గెట్ వద్ద అతికించారు. రెండు రోజుల క్రితం కొంతమంది కార్మికులు కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీలు, విద్యాసంస్థలు, వాహనాలపై దాడి చేసి ధ్వంసం చేసిన విషయం తెలిపిందే.
లాకౌట్ కారణంగా దాదాపు ఆరు వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. పరోక్షంగా ఇంకా అనేక మంది ఉపాధి కోల్పోతారు. ఇదిలా ఉండగా, పుదుచ్చేరి మంత్రులు ఇద్దరు ఈరోజు యానాంని సందర్శించనున్నారు. యానాంలో పరిస్థితుల వల్లే ఫ్యాక్టరీకి లాకౌట్ ప్రకటించినట్లు రీజన్సీ సిరామిక్స్ కంపెనీ చైర్మన్ జిఎన్ నాయుడు చెప్పారు. కంపెనీ అంతా శ్మశానంలాగా మారిపోయిందని ఆయన బాధపడ్డారు. ఉద్యోగులు అందరూ యానాం వదిలి వెళ్లిపోతున్నారన్నారు. ఉపాధ్యాయులు సైతం భయపడుతున్నారని, వారికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఉద్యోగులందరినీ, కార్మికులను తాము బిడ్డల్లాగా చూసుకున్నామన్నారు. జరిగిన ఘటనలో బయటవారి ప్రమేయం ఉందని ఆయన చెప్పారు.