Monday, May 21st

Telugu News - Online Telugu News Portal

ముందు ఆ పార్టీల అభిప్రాయం చెప్పమనండి : చిద్దూ

తెలంగాణపై కేంద్ర హోంమంత్రి చిదంబరం మళ్ళీ పాత పాటనే పునరావృత్తం చేశారు. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణ అంశంపై ఎప్పుడు తమ అభిప్రాయం చెబితే అప్పుడు అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని అన్నారు. తెలంగాణాపై ఏదో ఒకటి తెల్చేస్తామన్నారు కదా ఏమి చేశారు? అని ఒక విలేకరి అడగగా ఆయన పై విధంగా స్పందించారు. అఖిలపక్షం తేదీ కూడా ఆ పార్తీలనే అడగండి అంటూ ఉహిత సలహా ఇచ్చారు. తెలంగాణపై ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, సిపిఎం తమ అభిప్రాయాలు చెప్పాయి.

ఇప్పటి వరకు అభిప్రాయం చెప్పనివి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, అధికార కాంగ్రెసు పార్టీ, ఇటీవల జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు, మజ్లిస్ పార్టీలు మాత్రమే. దీంతో చిదంబరం తెలంగాణ అంశం గురించి మీడియా ఎప్పుడు ప్రస్తావించినా ఆ నాలుగు పార్టీలో అభిప్రాయం చెబితేనే కేంద్రం అఖిలపక్షం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటుందని చెబుతూ వస్తున్నారు.