పార్టీ ఎదుగుదల, ప్రత్యామ్నాయ సంస్కృతి, ప్రజాసమస్యల్ని రాజకీయ ఎజెండాలోకి తేవడమే లక్ష్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఎం 23వ రాష్ట్ర మహాసభలు గురువారం నుంచి పోరాటాల ఖిల్లా ఖమ్మంలో జరగనున్నాయి. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం ప్రారంభ సమావేశానంతరం మధ్యాహ్నం నుంచి ప్రతినిధుల సభ మొదలవుతుంది. రెండో రోజంతా పార్టీ కార్యకలాపాలపై చర్చ ఉంటుంది.
4న ముగింపు సభ జరుగుతుంది. సుమారు ఐదు దశాబ్దాల తర్వాత ఇక్కడ మూడు రోజుల పాటు జరిగే సభలకు ఖమ్మం సిద్ధమైంది. వచ్చే మూడేళ్లలో పార్టీ నిర్మాణంతో పాటు రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం కల్పించేలా ఈ మహాసభ నిర్ణయాలు తీసుకోనుంది. ఖమ్మం పట్టణమంతా ఎరుపుమయం అయింది. సభకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు మంది ప్రతినిధులు జిల్లాల నుంచి హాజరవుతున్నారు. ఈ మహా సభలకు కేంద్ర కార్యదర్శి ప్రకాష్ కారత్, కేంద్ర పార్టీ నేతలు సీతారాం ఏచూరి, బృందా కారత్, శ్రీనివాసరావు, రామచంద్ర పిళ్ళై హాజరు కానున్నారు.
| < Prev | Next > |
|---|


